‘ఉయ్యాలవాడ’పై అభిమానుల ఆగ్రహం

syera narsimhareddy

మెగాస్టార్ చిరంజీవి 151 సినిమా టైటిల్’గా ‘సైరా నర్సింహారెడ్డి’ ఖరారైంది. కొద్దిసేపటి క్రితమే సైరా నర్సింహారెడ్డి మోషన్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. హీరోయిన్ గా నయనతారని ఫైనల్ చేశారు. అయితే, టైటిల్ లో ఉయ్యాలవాడకు బదులుగా సైరాని చేర్చడంపై విమర్శలు మొదలయ్యాయి. ఉయ్యాలవాడ వారసులు, కొందరు చిరు అభిమానులు కూడా టైటిల్ లో ఉయ్యాలవాడని తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారమ్.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘సైరా నర్సింహారెడ్డి’ని రామ్ చరణ్ నిర్మించనున్నారు. ముందుగా ఈ సినిమా రూ. 100కోట్ల బడ్జెట్ తో ప్లాన్ చేశారు. ఆ తర్వాత బడ్జెట్ ని రూ. 150కోట్ల వరకు పెంచినట్టు తెలుస్తోంది. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ బాషల్లోకి తీసుకురానున్నారు.

మెగాస్టార్ రీ-ఎంట్రీ చిత్రం ‘ఖైదీ నెం.150’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు. ఇప్పుడు స్వాత్రంత్య సమరయోధుడు కథాంశంతో తెరకెక్కనున్న సైరా న్సర్సింహారెడ్డిపై ఓ రేంజ్ లో అంచనాలున్నాయి. మరి.. ఆ అంచనాలని ఏ మేరకు సైరా అందుకుంటాడన్నది చూడాలి.