“ఎన్టీఆర్’కు గుడి”కడుతున్న అభిమానులు.. !

ntr

యంగ్ టైగర్ ఎన్టీఆర్’ని దేవుడిని చేసేశారు.. ఆయన అభిమానులు. ఆయనకి ఇన్నాళ్లు గుండెల్లో గుడికట్టిన అభిమానులు.. ఇప్పుడు నేలపై ఎన్టీఆర్ గుడి కట్టబోతున్నారు. ఇప్పుడీ న్యూస్ విని తారక్ అభిమానులు మురిసిపోతున్నారు.

ఎన్టీఆర్ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. టెంపర్ నుంచి తారక్ జైత్ర యాత్ర కొనసాగుతూనే ఉంది. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవ కుశ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. దీంతో.. తెలుగు రాష్ట్రాలతో పాటు, ప్రక్క రాష్ట్రాల్లోనూ ఎన్ టీఆర్ క్రేజ్ పెరిగిపోయింది. కర్ణాటకలో ఎన్టీఆర్ క్రేజ్ మాములుగా లేదు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సినిమాలో ఎన్ టీఆర్ ఓ పాటపడటం.. అది కాస్త సూపర్ హిట్టయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కర్ణాటకలో ఎన్ టీఆర్ ఫాలోయింగ్ పెరగడం మొదలైంది. ఇప్పుడు కెరీర్ పీక్స్ లో ఉన్న ఎన్ టీఆర్ కోసం కన్నడ అభిమానులు గుడి కట్టేందుకు రెడీ అయ్యారు.

అతి త్వరలోనే ఎన్ టీఆర్ కు కట్టబోయే గుడి గురించి అధికారిక ప్రకటన చేయనున్నారని చెబుతున్నారు. ఇదే నిజమైతే.. ఎన్ టీఆర్ ఓ అరుదైన గౌరవాన్ని అందుకొన్నట్టే.