గోపిచంద్ తో బొమ్మరిల్లు

బొమ్మ‌రిల్లు, ప‌రుగు చిత్రాల‌తో కుటుంబ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకొన్నాడు భాస్క‌ర్‌. అయితే.. ఆరెంజ్‌, ఒంగోలు గిత్త ఫ్లాప్‌ల‌తో బాగా వెన‌క‌బ‌డ్డాడు. ఒంగోలు గిత్త తర్వాత ఆయనకు సినిమా లేదు. చాల రోజుల పాటు గీతా బ్యానర్ లో సినిమా చేయాలని ప్లాన్ చేశారు. కానీ అక్కడ వర్క్ అవుట్ కాలేదు. దీంతో ఇప్పుడు అయన ప్రాజెక్ట్ కోసం ప్లాన్ చేస్తున్నాడు.

గోపీచంద్ కు కథ చెప్పి, మెప్పించే ప్రయత్నంలో వున్నాడు భాస్క‌ర్‌. ఆయన ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం గోపిచంద్ కూడా పెద్ద ఫామ్ లో లేదు. లౌక్యం తర్వాత వచ్చిన సౌఖ్యం, ఆక్సిజన్ చిత్రాలు నిరాశ పరిచాయి. దీంతో కధల ఎంపికలో మరింత జాగ్రత్త వహిస్తున్నాడు గోపిచంద్.