హీరోయిన్ మందుకొట్టి పోలీసులకి అడ్డంగా దొరికిపోవడం హాట్ టాపిక్ గా మారింది. హీరోయిన్ హన్సిక ఫుల్ గా మందుకొట్టి.. అర్థరాత్రి స్కూటర్ పై చక్కర్లు కొడుతూ పోలీసులకి పట్టుపడింది. దీంతో.. హీరోయిన్ మందుకొట్టిందన్న... హీరోయిన్ మందుకొట్టి అడ్డంగా బుక్ అయ్యింది !

hansika

హీరోయిన్ మందుకొట్టి పోలీసులకి అడ్డంగా దొరికిపోవడం హాట్ టాపిక్ గా మారింది. హీరోయిన్ హన్సిక ఫుల్ గా మందుకొట్టి.. అర్థరాత్రి స్కూటర్ పై చక్కర్లు కొడుతూ పోలీసులకి పట్టుపడింది. దీంతో.. హీరోయిన్ మందుకొట్టిందన్న న్యూ స్ వైరల్ అయ్యింది. అయితే, రియల్ లైఫ్ లో కాదు. రీల్ లైఫ్ల్ లో.

జయం రవి – హన్సిక జంటగా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం ‘భోగస్’. లక్ష్మణ్‌ దర్శకుడు. ప్రభుదేవా నిర్మాత. ఈ చిత్రం జనవరి 26న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రంలో హన్సిక మందు కొట్టడం హాట్ టాపిక్ గా మారింది. అలా ఎందుకు మందు కొట్టావ్ ? అంటే.. కథ డిమాండ్ చేస్తే అలా చేశాను.

ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకునే నాకు మిలటరీ అధికారి అయిన నాన్న నిర్ణయించిన వివాహం చేసుకోవాలంటారు. అలా పెళ్లి నిశ్చితార్థ ఏర్పాట్లు కూడా చేస్తారు. ఆ నిశ్చితార్థం చెడ గొట్టాలని నేను టాస్మాక్‌ దుకాణంలోకి వెళ్లి 90 రూపాయలతో చీప్‌ సరకు కొనుక్కుని స్నేహితురాలి ఇంటికి వెళ్లి తాగి స్కూటర్‌లో ఇంటికి వెళ్లి నాన్నతో ధైర్యంగా ఈ పెళ్లి నాకు వద్దు అని చెప్పాలనుకుంటాను. అయితే మధ్యలో పోలీసులకు దొరికి పోవడంతో ప్లాన్ చిత్తై పోతుంది. అంటూ చెప్పుకొచ్చింది.

అయితే, బయట మాత్రం హన్సిక చాలా సిన్సియర్. మందుకొట్టడానికి వ్యతిరేకి. ఆమె సమాజసేవ కూడా చేస్తోంది. తన ప్రతి పుట్టిన రోజుకి ఓ అనాధని దత్తత తీసుకొంటోంది.

Indywood Film Carnival
లేటెస్ట్ గాసిప్స్