నిహారిక ‘వెడ్డింగ్’ వాయిదా ?

మెగా హీరోయిన్ నిహారిక వెడ్డింగ్ కు ముహూర్తం ఫిక్సయిన సంగతి తెలిసిందే. నాగ అశ్విన్ – నిహారికల ‘హ్యాపీ వెడ్డింగ్’ని ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు ప్రకటించేశారు. రిలీజ్ డేటుకు సంబందించిన పోస్టర్స్ కూడా వదిలారు. ఐతే, ఇప్పుడు ఈ వెడ్డింగ్ వాయిదా పదే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు సమాచారమ్.

‘హ్యాపీ వెడ్డింగ్’ విడుదలకు సరిగ్గా ఒక్క రోజు ముందు సుశాంత్ నటించిన ‘చిలసౌ’ విడుదల కాబోతుంది. ఈ రెండు సినిమాల నేపధ్యం మాత్రం ఒకటే. ఈ పోలిక హ్యాపీ వెడ్డింగ్ ఫలితాన్ని దెబ్బతీస్తుందని చిత్రబృందం బయపడుతోంది. ఈ నేపథ్యంలో నిహారిక వెడ్డింగ్ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు సమాచారమ్.

ఇక, ఈ నెల 21న హ్యాపీ వెడ్డింగ్ ప్రీ రిలీజ్ ప్లాన్ చేసారు. ఈ వేడుకకి మెగా ఫామిలీ నుంచి ఎవరు గెస్టులుగా వస్తారు అనే వివరాలు కూడా ఇంకా బయటికి రాలేదు. త్వరలోనే ఆ వివరాలు తెలియనున్నాయి. బహుశా.. మెగాస్టార్ చిరంజీవి రావొచ్చని చెబుతున్నారు.