హీరోయిన్ ఉద్యోగం ఖరీదైంది !

హీరోయిన్ ఉద్యోగం చాలా ఖరీదైంది అంటోంది బాలీవుడ్ బ్యూటీ రాధిక ఆప్టే. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఐదారు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. దీంతో.. బిజీ అయిపోయావ్. బాగా సంపాదిస్తున్నావ్ అంటున్నారంట. ఈ కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చింది రాధిక.

హీరోయిన్ కు కోట్ల పారితోషికం ఉంటుంది అనుకొంటారు. ఐతే, అదే రేంజ్ లో ఖర్చులు కూడా ఉంటాయి. అందాన్ని కాపాడుకోవడం మొదలుకొని వేసుకొనే దుస్తుల వరకు అంతా ఖరీదైన వ్యవహారమే. చక్కటి శరీరాకృతి కోసం ట్రైనర్‌లను పెట్టుకోవడమూ ఖర్చుతో కూడుకొన్నదేనని హీరోయిన్ క్లాస్ట్రీ ఖర్చుల లెక్కలు చెప్పింది.. ఈ ముద్దుగుమ్మ.

ఆమె నటించిన అక్షయ్ కుమార్ ‘ప్యాడ్ మ్యాన్’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్‌ బాల్కీదర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. ఇందులోని పాత్రకు అక్షయ్‌కుమార్ తప్పితే ఎవరూ న్యాయం చేయలేరని చెప్పుకొచ్చింది రాధిక. ప్రస్తుతం అన్నీ బాషల్లో కలిపి రాథిక చేతిలో ఏడు సినిమాలు చేతిలో ఉన్నాయి.