ఎన్టీఆర్ కోసం హాలీవుడు బ్యూటీ.. ?


ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా రాజమౌళి మల్టీస్టారర్ #RRR తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ మల్టీస్టారర్ కోసం హీరోయిన్స్ విషయంలో రోజుకో కొత్త న్యూస్ తెరపైకి వస్తోంది. ఈ సినిమా కోసం మొదట్లో టాలీవుడ్ హీరోయిన్స్ కీర్తి సురేష్, రకుల్ ప్రీత్ సింగ్, రష్మిక మందన.. తదితరుల పేర్లు వినిపించాయి. ఆ తర్వాత బాలీవుడ్ హీరోయిన్స్ పేర్లు తెరపైకి వచ్చాయి. #RRR కోసం జాన్వీ కపూర్, సారాఖాన్, పరిణీతి చోప్రా, అలియాభట్ ల పేర్లు వినిపించాయి.

ప్రస్తుతం హీరోయిన్ ఆలియా భట్ తో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఆమె సినిమాలో చరణ్ పక్కన కనిపిస్తుందని తెలుస్తోంది. మరోవైపు, ఎన్టీఆర్ సరసన నటించడానికి హాలీవుడ్ నటిని వెదుకుతున్నారట. ఎందుకంటే కథ ప్రకారం ఎన్టీఆర్ సరసన వుండే అమ్మాయి విదేశీ వనితగా కనిపిస్తుందట. ఎన్టీఆర్ తో రొమాన్స్ చేయబోతున్న ఫారిన్ బ్యూటీ ఎవరనేది త్వరలోనే తెలియనుంది.

ఇక, సినిమాలో ఎన్ టీఆర్ అడవిదొంగగా, ఆయన్ని పట్టుకొనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది.