హృతిక్ కూడా వాయిదా కోరుతుండు


బాలీవుడ్ లో హృతిక్ రోషన్, కంగనా ల పంచాయతీ గురించి తెలిసిందే. యేళ్ల పాటు సాగిన వీరి గొడవని బాలీవుడ్ ఎప్పటికీ మర్చిపోలేదు. మరోసారి హృతిక్, కంగా ఢీకొనే పరిస్థితి నెలకొంది. వీరిద్దరు నటించిన సినిమాలు ఒకే రోజు విడుదల కానుండటం ఇందుకు కారణం అయింది. హృతిక్ రోషన్ `సూపర్ 30`, కంగనా `మెంటల్ హై క్యా` చిత్రాలు జూలై 26న బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నాయి. పోటీపడటం హృతిక్, కంగనా ఇద్దరికి ఇష్టం లేదు.

తన సినిమాని వాయిదా వేయమని కంగనా ఇప్పటికే నిర్మాత ఏక్తా కపూర్ ని కోరింది. ఐతే, అందుకు ఆమె ఒప్పుకోలేదు. హృతిక్ కూడా తన సినిమాని వాయిదా వేయాలని కోరుతున్నాడు. కంగానాతో మెంటల్ టెన్షన్ ని తట్టుకోలేనని ఆయన అంటున్నారు. మొత్తానికి.. మరోసారి గొడవపడటం హృతిక్, కంగనా.. ఇదరికీ ఇష్టం లేనట్టుంది. అదీ.. మంచిదే మరీ.. !