గుడ్ న్యూస్ : సైరా కోసం ఇళయరాజా

మెగా అభిమానులకి గుడ్ న్యూస్. మెగాస్టార్ చిరంజీవి 151 సినిమా ‘సైరా నర్సింహారెడ్డి’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సురేంధర్ రెడ్డి దర్శకుడు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యింది. ఇప్పుడీ సినిమాకు సంగీతాన్ని అందించేందుకు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయారాజా అంగీకరించినట్టు సమాచారమ్.

ముందుగా ఈ సినిమా కోసం ఏఆర్ రెహమాన్ ను తీసుకోవడం.. బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన తప్పుకొన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత సైరా సంగీత దర్శకులుగా ఎస్.ఎస్. థమన్, ఎం.ఎం. కీరవాణి పేర్లు వినిపించాయి. ఇప్పుడు ఏకంగా ఇళయరాజ ఫైనల్ అయినట్టు చెప్పుకొంటున్నారు. దీనికి కారణం ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి ఇళయరాజాని కలిశాడన్న న్యూస్ లీకవ్వడమే. ఇందులో నిజమెంత ? అనేది సైరా చిత్రబృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.