#RRR కోసం ప్రియమణి ఖరారు


ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా రాజమౌళి మల్టీస్టారర్ #RRR తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెండో షెడ్యూల్ కూడా పూర్తికావొస్తున్నా.. ఇంకా హీరోయిన్స్ ఖరారు కాలేదు. ఇతర కీలక పాత్రలో కనిపించే నటీనటుల వివరాలు తెలియరాలేదు. ఇప్పటి వరకు ఎన్టీఆర్, రామ్ చరణ్, తమిళ దర్శకుడు సముద్రఖని ని మాత్రమే జక్కన ఫైనల్ చేశాడు. అధికారికంగా ప్రకటించాడు కూడా. ఐతే, ఇందులో సీనియర్ హీరోయిన్ ప్రియమణి కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు ప్రచారం జరిగింది.

ఇదే నిజమే. ఇటీవల ఆమెతో సంప్రదింపులు కూడా జరిగాయని విశ్వసనీయవర్గాల సమాచారమ్. ఈ సినిమా కోసం తమిళ దర్శకుడు సముద్రఖని పేరు వినిపించడం.. ఆ తర్వాత ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేయడం జరిగిపోయింది. ఇప్పుడు ప్రియమణి విషయంలోనూ అదే జరగనుంది. త్వరలోనే ఆర్ఆర్ఆర్ కోసం ప్రియమణి పేరుని జక్కన అధికారికంగా ప్రకటించబోతున్నట్టు సమాచారమ్. ఇక, ఆర్ఆర్ఆర్ హీరోయిన్స్ కోసం రష్మికమందన, కీర్తి సురేష్, రకుల్ ప్రీత్ సింగ్, అలియాభట్, పరిణీతి చోప్రా, జాన్వీకపూర్.. తదితర పేర్లు వినిపిస్తున్నాయి.