జగపతి డబుల్ రోల్..?

లెజెండ్ చిత్రంతో విలన్ గా ఎంట్రీ ఇచ్చిన జగపతి బాబు..ప్రస్తుతం విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీ గా ఉన్నారు. కేవలం తెలుగులోనే కాదు అన్ని ఇండస్ట్రీ ల్లో అవకాశాలు రాబట్టుకుంటూ రాణిస్తున్నారు. తాజాగా బాలకృష్ణ – కె ఎస్ రవికుమార్ కాంబినేషన్లో తెరకెక్కబోయే చిత్రంలో జగపతి బాబు విలన్ రోల్ చేస్తున్నట్లు వార్తలు ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే జగపతి బాబు ఈ సినిమాలో డబుల్ రోల్ చేస్తున్నట్లు వినికిడి. డబుల్ రోల్ విషయంలో డిస్కషన్లు జరుగుతున్నట్లు బోగట్టా.

బాలయ్య పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ అన్నపుడు విలన్ కూడా అంతకు అంతా పవర్ ఫుల్ గానే వుంటాడు. మరి డబుల్ రోల్ అన్నపుడు ఇద్దరూ ఎలా వుంటారు? ఏమిటి? అన్న సంగతి తెలియాల్సి వుంది. ఇక ఈ సినిమాకు రూలర్ అనే టైటిల్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఫిలిం ఛాంబర్ లో కళ్యాణ్ టైటిల్ ను రిజిస్టర్ చేయించారు.