జాన్వీ భయపెడుతుందట


అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ‘దఢక్’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమా సూపర్ హిట్ కావడంతో లక్కీ హీరోయిన్ అనిపించుకొంది. ప్రస్తుతం కరణ్ జోహార్ నిర్మిస్తున్న రెండు సినిమాల్లో నటిస్తోంది. అందులో ఒకటి గుంజన్ సక్సేనా బయోపిక్. ఇండియా ఫస్ట్ ఎయిర్ మార్షల్ గా పేరు తెచ్చుకున్న గుంజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. ఆమె 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో కీలక పాత్ర పోషించింది. గుంజన్ పాత్ర కోసం జాన్వీ ముందస్తు శిక్షణ తీసుకొంది.

ఇదిలావుండగా.. బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావ్ మరో హర్రర్ కామెడీ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రానికి ‘రూహ్‌ అఫ్‌జా’ అనే టైటిల్ పెట్టాడు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా జాన్వీకపూర్‌ని ఎంపిక చేసినట్లు సమాచారమ్. ”ధడక్‌’లో జాన్వీ నటన చిత్రబృందానికి బాగా నచ్చింది. ఈ చిత్రంలోని పాత్రకు ఆమె అయితే చక్కగా సరిపోతుందని భావిస్తున్నారట. దినేష్‌ విజన్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. కొత్త పెళ్లికొడుకులను తన పాటలతో నిద్రపుచ్చి పెళ్లి కూతుళ్లను ఆవహించే దెయ్యం కథ ఇదని చెబుతున్నారు.