jayasudha

సహజ నటి జయసుధ.. ఇప్పటికీ క్రేజ్ తగ్గని నటి. ఇండస్ట్రీ గ‌ర్వించద‌గ్గ గొప్ప న‌టీమ‌ణుల్లో ఆమె ఒకరు. ఆమెను అభిమానులు ప్రేమగా సహజనటి అని పిలుచుకుంటుంటారు. ఇప్పుడీ జయసుధ గురించి కొన్ని ఆసకికరమైన విషయాలు తెలిశాయి. అవి కూడా ఆమె టీనేజ్ విషయాలు కావడం విశేషం.

స్వ‌త‌హాగా జ‌య‌సుధ కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఆమె టీనేజ్ లో ఉన్నప్పుడు క్రికెట్ మ్యాచ్ లు ఎక్కువగా చూసేవారట. అంతేకాదు.. ఆమెకి క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ అంటే చాలా ఇష్టమట. ఈ విషయాన్ని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో స్వయంగా జయసుధనే తెలిపింది. టీనేజ్ లో ఉన్నప్పుడు ఇమ్రాన్ ఖాన్ ను చేసుకోవాలనుకునేవార‌ట‌. ఇప్పుడు అది సిల్లీగా అనిపిస్తుంటుందని నవ్వేసింది సహజ నటి.

ఎన్టీఆర్, ఏఎన్నార్ లతో నటించి మెప్పించిన జయసుధ… ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన శైలిలో రాణిస్తోంది. ముఖ్యంగా అమ్మ, భామ్మ పాత్రలకి ప్రాణం పోస్తోంది. ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘శతమానం భవతి’లో సహజ నటనతో ఆకట్టుకొంది.

లేటెస్ట్ గాసిప్స్