కాజల్ ప్రేమ బయటపడింది !

ముప్పై యేళ్లు దాటినా ఇంకా స్టార్ హీరోయిన్ రేంజ్ ని అనుభవిస్తోంది కాజల్ అగర్వాల్. ఈ వయసులోనూ యంగ్ హీరోయిన్స్ కు గట్టిపోటిని ఇస్తోంది. టాలీవుడ్, కోలీవుడ్ లోనూ సత్తా చాటుతోంది. తాను పెళ్లి చేసుకోకుండానే.. చెల్లి నిషా అగర్వాల్ కు పెళ్లి చేసింది. ఇప్పుడు నిషాకు బాబుకు పుట్టింది. బాబుని ఎత్తుకొని మురిసిపోతున్న కాజల్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.

చెల్లి పెళ్లి, పాప కూడా పుట్టడంతో కాజల్ పెళ్లి మేటరు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో ధైర్ఘ్యం చేసిన తన ప్రేమని బయటపెట్టింది కాజల్. “తానూ కచ్చితంగా పెళ్లి చేసుకుంటా. అదీ సరైన సమయంలో కరెక్ట్‌గా జరుగుతుంది. అన్నింటికంటే తాను అధికంగా ప్రేమించేది నటననే. ఐత్, పెళ్లి తర్వాత తాను నటనకు దూరం కానని చెప్పుకొచ్చింది”.. చందమామ.

ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన నాని ‘అ!’లో కాజల్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇకపై కూడా ఇలాంటి విభిన్నమైన సినిమాలు చేయాలని ఆశపడుతోంది. ప్రస్తుతం కోలీవుడ్ క్వీన్ (పారిస్ పారిస్)లో నటిస్తోంది. ఇక, తెలుగు క్వీన్ గా తమన్నా కనిపించబోతున్న సంగతి తెలిసిందే.