కాజల్ కాస్టిలీ అయిపోయింది

స్టార్ హీరోయిన్ కాజల్ మరింత కాస్టిలీ అయిపోయిందని చెప్పుకొంటున్నారు. ఈ వయసులోనూ యంగ్ హీరోయిన్స్ కి గట్టిపోటీ ఇస్తోంది చందమామ. గత యేడాది ‘ఖైదీ నెం. 150’, నేనే రాజు నేనే మంత్రి సినిమాలతో హిట్స్ అందుకొంది. ఈ యేడాది ప్రారంభంలోనే ‘అ!’తో అదిరిపోయే హిట్ అందుకొంది.

ఇంతటి జోష్ లో ఉన్న కాజల్ కు రవితేజ సినిమా ఆఫర్ వచ్చింది. అదే శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కనున్న రవితేజ ‘అమర్, అక్భర్, ఆంథోని’. ఐతే, ఇందులో నటించేందు కాజల్ సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారమ్. కారణమేంటని ఆరాతీస్తే.. రెమ్యూనరేషన్ తక్కువ కావడమేనని తెలిసింది.

ఇప్పుడు కాజల్ స్థానంలో నివేథా థామస్ ని తీసుకొన్నారు. మరో హీరోయిన్ గా అను ఇమ్మాన్యూయేల్ ని తీసుకొన్నారు. విల‌న్ గా ‘దూకుడు’ సినిమాలో విలన్ గా మెప్పించిన ‘తరుణ్ అరోరా’ తీసుకొన్నారు.