మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెం.150’ ఈ సంక్రాంతి కానుకగా ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. వి.వి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చిరు సరసన కాజల్ జతకట్టనుంది. మెగా ఖైదీ... కాజల్ కి ఖైదీ చేసిన అన్యాయం ఏంటీ ?

youme-song
మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెం.150’ ఈ సంక్రాంతి కానుకగా ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. వి.వి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చిరు సరసన కాజల్ జతకట్టనుంది. మెగా ఖైదీ రిలీజ్ తర్వాత మళ్లీ తన క్రేజ్ పెరిగిపోవడం ఖాయమని కాజల్ ఆశపడింది.

అయితే, ఇప్పటివరకు మెగా ఖైదీకి కాజల్ కి అన్యాయమే చేసినట్టు కనబడుతోంది. ‘ఖైదీ నెం.150’లో కాజల్ హీరోయిన్ అనే పేరు ఒక్కటి తప్ప.. ఇప్పటి వరకు కాజల్ హవా ఎక్కడా కనిపించలేదు. మెగాస్టార్ చిరంజీవి సినిమా కాదా.. అందులోనూ 9యేళ్ల తర్వాత రీ-ఎంట్రీ ఇస్తోన్న చిత్రం. దీంతో ప్రచారమంతా చిరుపైనే సాగుతుందని సర్థిపెట్టుకొంది కాజల్. అయినా.. మెగా ఐటమ్ లక్ష్మీరాయ్ కి ఇచ్చిన ప్రాధాన్యత కూడా కాజల్ కి దక్కడం లేదట. ఇది కాజల్ కి ఏమాత్రం మింగుడుపడటం లేదు.

కాజల్ పరిస్థితిని గమనించిన దర్శకుడు వినాయక్ ఒక్కడే.. ప్రమోషన్స్ లో అడగక్కపోయినా కాజల్ గురించి ఓ మాట పడేస్తున్నాడని టాక్. మెగాస్టార్ తో ‘కత్తి’ రిమేక్ అనుకొన్నప్పుడు చిరు సరసన అనుష్క, కాజల్ ని అనుకొన్నాడట వినాయక్. చివరికి చిరు ప్రక్కన కాజల్ సెట్టయ్యిందని చెప్పుకొచ్చాడు. పోనిలే దర్శకుడు వినాయక్ అయినా కాజల్ కి కాస్త్ కూస్తో న్యాయం చేస్తున్నాడు.

Indywood Film Carnival
లేటెస్ట్ గాసిప్స్