Kangana-Ranau

కంగ‌నా ర‌నౌత్ – హృతిక్ రోషన్ లవ్ ఎఫైర్ గురించి తెలిసిందే. చాన్నాళ్లు బాలీవుడ్ హెడ్ లైన్స్ లో నిలిచింది వీరి ఎఫైర్. ఎఫైర్ ని పబ్లిక్ చేసుకొని రచ్చ రచ్చ చేసుకొన్నారు. కోర్టుమెట్లు కూడా ఎక్కారు. చివరికి తీర్పు ఇవ్వలేక కోర్టు కూడా చేతులెత్తేసింది. గతంలోనూ చాలామందితో ఎఫైర్స్ ని నడిపిందీ.. బ్యూటీ. వ‌ర్కౌట్ కాన‌ప్పుడు వ‌దిలివేస్తాన‌ని, వాళ్ల‌ను త్వ‌ర‌గా మ‌రిచిపోతాన‌ని తేల్చేసింది. చెప్పినట్టుగానే హృతిక్ ఏపీసోడ్ ని త్వరగానే మర్చిపోయింది కంగనా.

ఇప్పుడు హృతిక్ ఏపీసోడ్ ముగిసిపోయింది. దీంతో.. మళ్లీ లవ్ పడింది బాలీవుడ్ క్వీన్. ఆ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. ఓ ఇంటర్వ్యూలో తన కొత్త భాయ్ ప్రెండ్ గురించి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం డేటింగ్ ఉన్నానని.. ఈ యేడాదియే పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలిపింది. అయితే, భాయ్ ఫ్రెండ్ పేరు మాత్రం చెప్పలేదు.

మరీ.. క్వీన్ డేటింగ్ పెళ్లి వరకు వెళుతుందా.. ? మిగితా లవ్ ఎఫైర్స్ లాగానే మధ్యలోనే బ్రేకప్ న్యూస్ వినిపిస్తుందా.. ?? అన్నది ఆసక్తిగా మారింది.
ఏదేమైనా.. కొత్త లవ్వర్ న్యూస్ హుషారుగా చెప్పేసి మరోసారి ఆకట్టుకొంది క్వీన్.

లేటెస్ట్ గాసిప్స్