ఐపీఎల్ కోసం కత్రినాకు భారీ రేటు.. !

ఐపీఎల్ సీజన్ – 11 కోసం బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్’కు భారీ రేటు దక్కినట్టు సమాచారమ్. ఆమె ఐపీఎల్‌ క్లోజింగ్‌ సెర్మనీలో డాన్స్‌ చేయనుంది. బాలీవుడ్‌ హిట్‌ సాంగ్‌ ‘స్వాగ్‌ సె స్వాగత్‌’ సాంగ్‌కి కత్రినా చిందేయనుంది. సల్మాన్‌ – కత్రినా జంటగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘టైగర్‌ జిందా హై’ చిత్రంలోని పాట ఇది. దాదాపు 10ని॥ల పాటు కత్రినా డాన్స్‌ షో ఉండనుంది.

గతంలోనూ ఐపీఎల్ ఓపెనింగ్‌ సెర్మనీలో స్పెషల్‌ సాంగ్‌లో కత్రినా అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఐతే, గతంతో పోల్చితే రికార్డు స్థాయిలో ఆమె పారితోషికం తీసుకోబోతుందని చెప్పుకొంటున్నారు. ఈ ఆదివారం చెన్నై-హైదరాబాద్ జట్ల ముంబై వేదికగా ఐపీఎల్ సీజన్ – 11 ఫైనల్ జరగనున్న సంగతి తెలిసిందే.