మహేష్ కోసం కత్రినా.. నిజమేనా ?


సూపర్ మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి వంశీపైడి పల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ 5న మహర్షి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో మహేశ్ సినిమా ఉండనుంది. ఈ సినిమా హీరోయిన్ కోసం పలువురు పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే సుకుమార్ సినిమాలో మహేష్ హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్, కైరా అద్వానీ తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

తాజాగా, ఈ లిస్టులోకి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ వచ్చి చేరింది. మహేశ్ కోసం కత్రినా కైఫ్ ను తీసుకునే ఆలోచనలో సుకుమార్ ఉన్నట్టు సమాచారమ్. ప్రస్తుతం ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. కెరియర్ ఆరంభంలో కత్రినా ఇక్కడ మల్లీశ్వరి, అల్లరి పిడుగు సినిమాల్లో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్ లో బిజీ అయిపోయింది. అక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇలాంటి నేపథ్యంలో ఆమె మహేష్ సినిమాతో టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.