కమెడియన్’తో ప్రేమలో కీర్తి ?


ఒకట్రెండు సినిమాల్లో జంటగా నటిస్తే ఆ హీరో-హీరోయిన్స్ బోలేడు పుకార్లు పుట్టిస్తారు. హీరోనే కాదు.. కమెడియన్ తో కలిసి పనిచేసిన అవే పుకార్లు పుట్టుకొస్తున్నాయి. కీర్తి సురేష్ విషయంలో అదే జరుగుతోంది. ఆమె ఓ కమెడియన్ తో ఎఫైర్ కొనసాగిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. కీర్తి సురేశ్ కెరీర్ స్టార్టింగ్‌లో ఆ కమెడియన్.. ఆమెకు బాగా సహాయం చేశాడట. దీంతో వీరిద్దరి మధ్య బంధం బలబడిందట. కొద్దిరోజులుకి వీరి స్నేహం ప్రేమగా మారిందని కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాదు.. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ప్రతి సినిమాలో ఆ కమెడియన్ నటిస్తున్నారంట. కీర్తి రిఫరెన్స్ తోనే ఆ కమెడియన్ ని తప్పక తీసుకొంటున్నట్టు చెప్పుకొంటున్నారు. ఈ ప్రచారం నిజమేనా.. ? గాసిప్పుల్లో ఇదో గాసిప్పా.. ?? అన్నది తెలియాల్సి ఉంది. ఇక, మహానటి తర్వాత తెలుగులో కీర్తి ఆ రేంజ్ సినిమా చేయలేదు. ప్రస్తుతం మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రజనీ కాంత్ దర్భార్ లో నటిస్తొంది.