కైరా సీక్రెట్ విప్పింది


టాలీవుడ్ స్టార్స్ కి మంచి ఆప్షన్ గా మారింది హీరోయిన్ కైరా అద్వానీ. మహేష్ భరత్ అను నేను సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కైరా. ఆ తర్వాత రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’లో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా సంక్రాంత్రి కానుకగా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. చరణ్ తర్వాత కైరా అల్లు అర్జున్ తో రొమాన్స్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.

త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న బన్నీ సినిమా కోసం కైరా పేరునే వినిపిస్తోంది. ఇలా వరుసగా స్టార్ హీరోలతో జతకడుతూ స్టార్ టాలీవుడ్ లో హీరోయిన్ అయిపోయేలా ఉంది కైరా. ఇదంతా బాగానే ఉంది. కానీ, ఇంతకీ కైరాని తెలుగు సినిమాకి రికమెండ్ చేసింది ఎవరో తెలుసా.. ? మహేశ్ సతీమణి నమ్రత. అవునూ.. బాలీవుడ్ లో ‘ఎంఎస్ ధోని’ సినిమా చేసే ముందు తనను నమ్రతా కలిసింది. టాలీవుడ్ లో సినిమా చేయాలని అడిగింది. మహేష్ ‘భరత్ అనే నేను’ కోసం నమ్రత తనని రికమెండ్ చేసిందని తెలిపింది.