‘కిర్రాక్ పార్టీ’లో దర్శక-నిర్మాతకు చెడిందా ?

శరన్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో నిఖిల్ – సంయుక్త హెగ్డే, సిమ్రన్‌ పరీన్జ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం “కిర్రాక్ పార్టీ”. కన్నడ సూపర్ హిట్ ‘కిర్రాక్ పార్టీ’కి రిమేక్ ఇది. ఈ చిత్రానికి దర్శకుడు సుధీర్‌వర్మ స్క్రీన్‌ప్లే అందించారు. మరో దర్శకుడు చందూ మొండేటి సంభాషణలు రాశాడు. ఈ రెండు కూడా సినిమాకే హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు.

ఈ సినిమా షూటింగ్ సమయంలో దర్శక-నిర్మాతకు మధ్య విబేధాలు తలెత్తినట్టు వార్తలొచ్చాయ్. ఐతే, ఈ సినిమా ప్రమోషన్స్ పాల్గొన్న హీరో నిఖిల్ ని ఈ విషయంపై ప్రశ్నిస్తే.. అలాంటిదేమీ లేదని కొట్టిపారేశారు. సినిమాకు కొబ్బరికాయ కొట్టిన మొదటిరోజు, ఆ తర్వాత మధ్యలో ఒకసారి మాత్రమే నిర్మాత సెట్స్‌కు వచ్చారు. ఆయనకు, దర్శకుడికి మధ్య విబేధాలు వచ్చాయన్నది వదంతులే తప్ప నిజం కాదని క్లారిటీ ఇచ్చారు. దీంతో.. కిర్రాక్ పార్టీ లో దర్శక-నిర్మాతలకు గొడవ ప్రచారానికి తెరపడినట్టే.. !