బోయ్ ఫ్రెండుతో కలిసి షూటింగ్’కు హీరోయిన్

అందంతో పాటు మంచి ఫిజిక్ రాయ్ లక్ష్మీ సొంతం. రాయ్ లక్ష్మీ అందాలు ఆరబోస్తుంటే రెండు కళ్లు సరిపోవు. ఎంత ఉన్న ఏం లాభం. ఈ భామకు సరైన గుర్తింపు మాత్రం రావట్లేదు. “ఖైదీ నెంబర్ 150” రత్తాలుగా అందరినీ ఆకట్టుకున్న ముద్దుగుమ్మ రాయ్ లక్ష్మీ. ఆ తరువాత “జూలీ” చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. అయితే ఆమెకు అక్కడ ఏమాత్రం కలిసిరాలేదు. అందాలు మొత్తం ఒలికించిన కూడా బాలీవుడ్ ప్రేక్షకులు రాయ్ లక్ష్మీని పట్టించుకోలేదనే చెప్పాలి.

ఇటీవల కాలంలో మరీ నాజూగ్గా తయారైంది ఈ బ్యూటీ. ప్రస్తుతం తెలుగులో “వేర్ ఈజ్ వెంకటలక్ష్మీ” చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులూ రాయ్ లక్ష్మీతో పాటు ఆమె బాయ్ ఫ్రెండ్ వచ్చేవాడట. అతనెవరు ? మాత్రం తెలియరాలేదు. గతంలో కూడా రాయ్ లక్ష్మీ కొంతమందితో డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అందులో ప్రముఖ క్రికెటర్ తో ఆమె డేటింగ్ చేస్తున్న వార్తలు వైరల్ అయ్యాయి. మరి మళ్ళీ రాయ్ లక్ష్మీ ప్రేమలో పడిందా ? అన్నది తెలియాల్సి ఉంది.