హిట్ ఇవ్వని గ్లామర్

హీరోయిన్స్’కు గ్లామర్ నే పెద్ద ఆస్తీ. దీనికి తోడు కాస్త నటన తెలిస్తే స్టార్ హీరోయిన్ అయిపోవచ్చు. ఐతే, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి విషయం రివర్స్ అయ్యింది. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ నటనతో ఆకట్టుకొంది. అందాల రాక్షసి, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయన, శ్రీరస్తు శుభమస్తు సినిమాలతో హిట్స్ సొంతం చేసుకొంది. అయినా స్టార్ హీరోయిన్ అనిపించుకోలేకపోయింది. దీనికి ఆమె గ్లామర్ డోస్ పెంచకపోవడమే కారణమనే టాక్ వినిపించింది.

ఇది చెవినపడ్డ లావణ్య గ్లామర్ డోస్ పెంచడానికి సై అంది. ఈ మేరకు దర్శక-నిర్మాతలకు సంకేతాలు కూడా ఇచ్చింది. విన్నర్ సినిమా నుంచి కాస్త హాట్ హాట్ గా కనిపిస్తూ వస్తుంది. మిస్టర్, యుద్ధం శరణం, రాథా, ఉన్నది ఒకటే జిందగీ, ఇంటిలిజెంట్ సినిమాల్లో మునుపటి కంటే గ్లామర్ కనిపించి ఆకట్టుకొంది. ఐతే, ఈ సినిమాలేవీ లావణ్యకి హిట్ ఇవ్వలేదు. దీంతో.. గ్లామర్ కనిపించినంత మాత్రన హిట్ దక్కదనే సూత్రం లావణ్యకు తెలిసొచ్చింది. మరీ.. స్టార్ హీరోయిన్ అనిపించుకోవడమెలా అన్నది లావణ్యని తొలిచేస్తున్న ప్రశ్న.. !