శివరాత్రి కానుకగా ‘మహానాయకుడు’..?

ఎన్టీఆర్ కథానాయకుడు భారీ ప్లాప్ కావడం ఆ ఎఫెక్ట్ రెండో పార్ట్ ఎన్టీఆర్ మహానాయకుడు ఫై గట్టిగానే పడింది. మొదటి పార్ట్ కు టాక్ బాగానే వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం ఎవరు ఊహించని స్థాయి లో రావడం అందరికి షాక్ కలిగించాయి. దాదాపు బయ్యర్ల అందరికి 80 నుండి 90 శాతం నష్టాలు రావడం తో రెండో పార్ట్ తో ఆ లోటును తీర్చాలని చూస్తున్నారు. కానీ రెండో పార్ట్ ఫై ఏమాత్రం బజ్ లేకపోవడంతో సినిమా విడుదలపై నానా కష్టాలు పడుతున్నారు.

మొదటగా ఫిబ్రవరి 07 న రిలీజ్ చేయాలనీ అనుకున్నారు కానీ టెక్నికల్ ఇష్యూస్.. సెన్సారింగ్ లాంటివి దృష్టిలో పెట్టుకొని ఫిబ్రవరి 21 కి వాయిదా వేశారు. కానీ ఇప్పుడు ఆ డేట్ కు కాకుండా మహాశివరాత్రి కానుకగా విడుదల చేయాలనీ భావిస్తున్నారట. మార్చి 04 న శివరాత్రి కాబట్టి ఫిబ్రవరి 28 న లేదా మార్చి 01 నైనా రిలీజ్ చేస్తే సినిమాకు బాగా కలిసొస్తుందని అనుకుంటున్నారట. మరి ఆ తేది కైనా విడుదల చేస్తారో లేదో చూడాలి.