మహర్షి ‘9’ సెంటిమెంట్..ఎంత వరకు వర్క్ అయ్యెను..?

సూపర్ స్టార్ మహేష్ బాబు 25 వ చిత్రంగా తెరకెక్కిన మహర్షి ‘9’ సెంటిమెంట్ ను ఫాలో అవుతుంది. సినిమాకు సంబందించిన అన్ని కార్య క్రమాలను ‘9’ తో ముడి పెట్టడం సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను 9 గంటల 9 నిమిషాలకు.. ఫస్ట్ లుక్ పోస్టర్ ను 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేశారు.

ఇప్పుడు ట్రయిలర్ కూడా ఈరోజు సాయంత్రం సరిగ్గా 8 గంటల 10 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు. అలా ట్రయిలర్ విషయంలో కూడా 9-సెంటిమెంట్ ఫాలో అయ్యారు మేకర్స్.వేదిక ఫై ట్రైలర్ రిలీజ్ టైం కాస్త అటు ఇటైనా యూట్యూబ్ లో మాత్రం సరిగ్గా 8 గంటల 10 నిమిషాలకు విడుదల చేయబోతున్నారట. చిత్ర యూనిట్ సెంటిమెంట్ ఇలా ఉంటె..బయట జనాలు మాత్రం ఇంతవరకు విడుదల చేసిన ఏది కూడా ఆకట్టుకునేలా లేదు..కనీసం ట్రైలర్ అయినా ఆకట్టుకునేలా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలియజేస్తున్నారు. మరి మహర్షి ‘9’ సెంటిమెంట్ ఎంత వరకు వర్క్ అయ్యిందో చూడాలి.