‘మహర్షి’లో ఆ పాత్రే హైలైట్ !

మహేష్ నటిస్తున్న 25వ చిత్రమిది. ఈ చిత్రానికి వంశీపైడిపల్లి దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే హీరోయిన్. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించారు. మే 9న మహర్షి ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇందులో మహేష్ మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. కాలేజె స్టూడెంట్, బిజినెస్ మేన్, రైతుగా మహేష్ కనిపిస్తారు. ఇప్పటికే కాలేజీ స్టూడెంట్, బిజినెస్ మేన్ గా మహేష్ లుక్స్ బయటికొచ్చాయి. రైతు పాత్రని మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. ఐతే, స్టూడెంట్, బిజినెస్ మెన్ కంటే కామన్ మెన్ గా మహేష్ ఎలా రియాక్ట్ అయ్యాడు అనే విషయం సినిమాలో హైలైట్ అవుతుందని దర్శకుడు వంశీ అంటున్నారు. అందుకే ఆ పాత్ర లుక్ ని రిలీవ్ చేయకుండా సప్రైజ్ చేయనున్నట్టు తెలుస్తోంది.

ఇక, మహర్షి ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరిగిందని తెలుస్తోంది. ఏకంగా రూ. 140కోట్ల బిజినెస్ చేసిందట. సినిమా కోసం పెట్టిన ఖర్చు కూడా ఎక్కువే. దాదాపు రూ. 90కోట్లు ఖర్చు పెట్టారట. అయినా.. విడుదలకి ముందే రూ. 50కోట్లు లాభాలు తెచ్చిపెట్టాడు మహర్షి.