మహర్షి అసలు కథ వేరట..

మహేష్ బాబు 25 వ చిత్రం గా తెరకెక్కిన మహర్షి మే 09 న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ఫై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఈ సినిమాలో మహేష్ మూడు పాత్రల్లో కనిపించబోతున్నాడు..అల్లరి నరేష్ , పూజా హగ్దే , మహేష్ ముగ్గురు ఫ్రెండ్స్ అని.. మహేష్ బాబు అమెరికాలో బడా పారిశ్రామిక వేత్త, తన స్నేహితుడు అల్లరి నరేష్ కోసం ఇండియాకు వచ్చి, రైతుల కష్టాలు చూసి, వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలని ట్రై చేస్తాడని ఇలా ప్రచారం జరుగుతుంది. కానీ ఈ సినిమా కథ వేరని అంటున్నారు.

ఈ సినిమాలో అసలు సిసలు వ్యవహారం మహేష్ బాబు క్యారెక్టర్ నే అని తెలుస్తోంది. సినిమాలో మహేష్ బాబు ఒక రకమైన అగ్రెసివ్ ఆటిట్యూడ్ తో వుంటాడని అంటున్నారు. సక్సెస్, పేరు, డబ్బు, దీని మీదే దృష్టి. తన పేరు అంటే గౌతమ్ కేరాఫ్ కంపెనీ పేరు. చదువులో సక్సెస్, వ్యాపారంలో సక్సెస్, ఇలా ప్రతి రంగంలో సక్సెస్.. కానీ సక్సెస్ వెనుక ఫ్లాష్ బ్యాక్ ఉంటుందట.. అది ఎక్కడికి దారి రిషి అనేవాడు మహర్షి ఎలా అయ్యాడు అన్నది కథ అని అంటున్నారు. మరి ఇది నిజమా..కదా అనేది సినిమా విడుదలైతే కానీ తెలియదు.

వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా..దిల్ రాజు , అశ్విని దత్ , పివిపి లు నిర్మాతలు.