మహేష్ ఫ్యామిలీ టూర్.. ఈసారి ఎక్కడికో తెలుసా ?


సూపర్ స్టార్ మహేష్ బాబు తన ప్రతి సినిమా పూర్తికాగానే ఫ్యామిలీ తో ఫారిన్ టూర్ వేయడం అలవాటు. ఈసారి సమ్మర్ కూడా కలిసొచ్చింది. దీంతో మహేష్ ఫ్యామిలీ టూర్ వేయబోతున్నట్టు సమాచారమ్. స్తుతం మహేష్ బాబు నటిస్తోన్న ‘మహర్షి’ సినిమాకి సంబంధించిన పనులు ఏప్రిల్ 20నాటికి పూర్తవుతాయి. ఆ వెంటనే పది రోజుల పాటు కుటుంబంతో విదేశాలకు వెళ్లి సేదతీరాలని భావిస్తున్నాడు. తిరిగొచ్చాక మహర్షి ప్రమోషన్స్ ని మొదలెట్టనున్నాడు.

ఇంతకీ ఈసారి మహేష్ ఎక్కడికి వెళ్లనున్నాడు ? అంటే.. ఇంకా క్లారిటీ లేదు. టూర్ కి వెళ్లక.. అక్కడ దిగిన ఫోటోలని మహేష్ అభిమానులతో పంచుకొంటూ ఉంటాడు. అప్పుడు తెలుస్తుంది.. మహేష్ ఎక్కడికి వెళ్లారన్నది. ఇక, మహర్షి మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్ కి మంచి స్పందన వస్తోంది.