మహేష్ గొప్ప మనసు

mahesh

సూపర్ స్టార్ మహేష్ బాబుది గొప్ప మనసని మరోసారి రుజువైంది. సినిమా ఫలితం కాస్త అటు ఇటు అయితే.. వారిని ఆదుకొని అలవాటు టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉంది. ఆయన బాటలో కొద్దిమంది యంగ్ హీరోలు కూడా నడుస్తున్నట్టు చెబుతుంటారు. అయితే, పవన్ రేంజ్ హీరోల్లో మహేష్ బాబు ఆ పని చేస్తున్నారు. నిర్మాతలు నష్టపోతే వారిని ఆదుకొనే అలావాటు మహేష్ కూడా ఉంది.

ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన మహేష్ ‘స్పైడర్’ నిర్మాతలకి నష్టాలని మిగిల్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారిని ఆదుకొనేందుకు మహేష్ తనవంతు సాయం చేసినట్టు తెలుస్తోంది. స్పైడర్ సినిమా కోసం తీసుకొన్న రెమ్యూనరేషన్ ని తిరిగిచ్చేశాడట. ఈ సినిమా కోసం మహేష్ బాగా కష్టపడ్డారు. ఎప్పుడంటే అప్పుడు కాల్షీట్లు ఇచ్చేశారు. కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అను నేను’ సినిమా మొదలెట్టాక కూడా స్పైడర్ కోసం డేట్స్ ఇచ్చారు. ఇవీగాక, సినిమాలో రిస్కీ ఫైట్స్ చేశారు. అంత చేసిన నిర్మాతలు నష్టపోవడం మహేష్ కి నచ్చలేదు. అందుకే వారిని ఆదుకొన్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం మహేష్ ‘భరత్ అను నేను’ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాని వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.