మాల్దీవులకు అక్రమ జంట

అక్రమ సంబంధాన్ని సక్రమ సంబంధంగా మార్చుకొనే ప్రయత్నంలో ఉన్నారు మలైకా, అర్జున్‌కపూర్‌. వీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలొస్తున్నాయ్. ఐతే, పెళ్లి వరకు కూడా ఈ జంట దూరంగా ఉండటం లేదు. మలైకా ఎక్కడుంటే అక్కడ అర్జున్‌ వాలిపోతున్నాడు. ఐతే, తాజాగా మలైకా షేర్ చేసిన పిక్ లో అర్జున్ కనిపించకపోవడంపై అనుమానాలు కలుగుతున్నాయి.

ఇటీవల తను మాల్దీవులకు వెళ్ళినప్పటి ఫోటోలను మలైకా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంది. కాకపోతే అందులో అర్జున్‌ కపూర్‌ మిస్‌ అయ్యాడు. కావాలనే మలైకా తన ఫోటో మాత్రమే షేర్‌ చేసిందా? లేకపోతే ఇద్దరి మధ్యా విబేధాలు వచ్చి మాల్దీవులకు మలైకా మాత్రమే వెళ్ళిందా ? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆ అనుమానాలకి పులిస్టాప్ పడాలంటే.. అర్జున్-మలైకా కలిసి దిగిన లెటెస్ట్ ఫోటో ఒకటి బయటికిరావాలి.