‘అరుధంతి’ ఆఫర్’ని వదులుకొందట

‘అరుధంతి’ సినిమా అనుష్కని స్టార్ హీరోయిన్’ని చేసింది. ఈ సినిమాతోనే ఆమెలోని అసలు టాలెంట్ బయటపడింది. ఆ తర్వాత రుద్రమదేవి, బాహుబలి, భాగమతి సినిమాలతో లేడీ సూపర్ స్టార్ అని పించుకొంది. ఐతే, అరుధంతి కోసం అనుష్క కంటే ముందు హీరోయిన్ ని మమతా మోహన్ దాస్ ని సంప్రందించారట. ఈ ఆఫర్ ని కాదనుకొన్న మమతా ఆ తర్వాతా చాలా ఫీలయిందట.

యంగ్ టైగర్ ఎన్ టీఆర్ ‘యమదొంగ’తో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది మమతా మోహన్ దాస్. సింగర్ కూడా పలు చిత్రాలకు పాటలు పాడింది. ఆ తర్వాత మలయాళ ఇండస్ట్రీకి వెళ్లింది. పెళ్లి చేసుకోవడం.. యేడాదిలోపే విడాకులు తీసుకోవడం జరిగిపోయింది. ఆ తర్వాత క్యాన్సర్ బారినపడి.. ఇప్పుడు పూర్తిగా కోలుకొంది. ప్రస్త్తుతం సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉంది. ఈ సందర్భంగా తనకు వచ్చిన అరుంధతి ఆఫర్ ని వదులుకొన్నందుకు ఘటనని గుర్తు చేసుకొంది.