కంగనా దెబ్బకు నిర్మాత అవుట్…

ఏ క్షణాన `మణికర్ణిక` చిత్రాన్ని మొదలు పెట్టారో..అప్పటినుండి ఏదో ఒక సమస్య ఈ చిత్రాన్ని వెంటాడుతూనే ఉంది. క్రిష్ ఈ చిత్రాన్ని తప్పుకోవడం తో ఈ బాధ్యతలను హీరోయిన్ కంగనా తీసుకుంది. హీరోయిన్ గా నటిస్తూనే దర్శకత్వ బాధ్యతలను భుజాన వేసుకుంది. బాధ్యతలు తీసుకోవడమే ఆలస్యం తనకు నచ్చని సన్నివేశాలను తొలగించడం మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో సోను సూద్ తో కంగనా కు మధ్య గొడవ ఏర్పడింది. దీంతో ఈ సినిమాను నుండి సోను తప్పుకున్నాడు. ఇదిలా ఉండగానే తాజాగా ఈ మూవీ నిర్మాతల్లో ఒకరు సంజయ్ కుట్టి కూడా తప్పుకున్నట్లు సమాచారం.

70 కోట్లలో అనుకున్న `మణికర్ణిక` ఇప్పుడు 100 కోట్లు ఖర్చు అవుతుందని కంగన అడ్డగోలుతనంతో చిక్కులొచ్చి పడ్డాయని నిర్మాత భావిస్తున్నారట. కంగన దర్శకత్వ బాధ్యతలు చేపట్టాక పెరిగిన బడ్జెట్ని కొత్తగా రివైజ్ చేసి మళ్లీ చెప్పిందిట. ఇక లాభం లేదనుకుని…జరిగిందిందే జరిగిపోయిందని భావించి సంజయ్ కుట్టి కూడా తప్పుకున్నాడని బాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో నిర్మాణ బాధ్యతల్ని కొత్త వారు తీసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది.