డైలాగ్ కింగ్ పొలిటికల్ పంచులు టీడీపీ పైనే.. !

చాలా గ్యాప్ తర్వాత మోహన్ బాబు థియేటర్స్ లో గర్జించారు. ‘గాయత్రి’ సినిమాలో ద్విపాత్రాభినయంతో అదరగొట్టాడు. సినిమా ఫలితాన్నిప్రక్కన పెడితే మోహన్ బాబు నటనకు, ఆయన చెప్పిన డైలాగ్స్ కు థియేటర్స్ లో విజిల్స్ పడుతున్నాయి.

సినిమాలో మోహన్ బాబు పలికిన పొలిటికల్ పంచులు బాగానే పేలాయి. ఇప్పుడీ డైలాగులపై సోషల్ మీడియా వేదికగా హాట్ హాట్ చర్చ సాగుతోంది. ‘ఒకడేమో బీకామ్‌లో ఫిజిక్స్ చదివానంటాడు. ఇంకొకడేమో ‘నా పెన్షన్ తీసుకుంటున్నావ్, నా రోడ్ల మీద నడుస్తున్నావ్, ఓటు నాకే వేయాలంటాడు’. మరొకడేమో.. ‘సార్వభౌమాధికారం అని పలకలేక భౌభౌఅంటాడు’ అంటూ డైలాగ్ కింగ్ చెప్పిన డైలాగ్స్ కు థియేటర్స్ దద్దరిల్లిపోతున్నాయి.

ఈ డైలాగ్స్ అన్నీ టీడీపీపైనా అనే చర్చ సోషల్ మీడియా వేదికగా సాగుతోంది. ఇప్పటికే మోహన్ బాబు రాజకీయాల్లోకి వెళ్లొచ్చారు. ఎంపీగా పనిచేశారు. ఆయన రాజకీయాల్లోకి రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారనే చర్చ గత మూడ్నాళ్లులుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన తన సినిమాలో పొలిటికల్ పంచులేశాడని చెబుతున్నారు. దానిలో గతంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ నోరు జారిన ‘బీకామ్ లో ఫిజిక్స్ చదివా..’ సటైర్ ఉండటంతో.. అవన్నీ టీడీపీ పైనే అంటూ వైసీపీ నేతలు చేతులు దులుపుకొంటున్నారు.