mohanlal
సంపూర్ణ నటుడు అనిపించుకొన్నాడు మోహన్ లాల్. ఇప్పుడీ సూపర్ స్టార్ ఓ సాహాసం చేయబోతున్నట్టు సమాచారమ్. ఇండియాలోనే భారీబడ్జెట్ చిత్రాన్ని చేయబోతున్నాడట. భారీ బడ్జెట్ తో బాహుబలి, రోబో 2.0 తలదన్నే సినిమాని ప్లాన్ చేస్తున్నాడంట.

మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కి టాలీవుడ్, కోలీవుడ్ లోనూ మంచి మార్కెట్ ఉంది. 2016లో ఆయన చేసిన చిత్రాలన్ని బ్లాక్ బస్టర్ హిట్స్. మనమంతా, జనతా గ్యారేజ్, ఒప్పమ్‌, పులిమురుగన్‌ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి.

ఇక, తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా దాదాపు రూ. 600కోట్ల బడ్జెట్ తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడట మోహన్ లాల్. ఎం.టి.వాసుదేవ నాయర్‌ రచించిన ‘రాండమ్‌ఓజ్‌హమ్‌’ అనే నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కబోతోందట. ఈ చిత్రం తర్వాత రిటెర్మెంట్ గురించి ఆలోచిస్తాడని చెబుతున్నారు.

అయితే, సూపర్ స్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్ కి దర్శకుడు, నిర్మాత ఎవరు అన్నది ఇంకా ప్రకటించలేదు. కొందరు మాత్రం మోహన్ లాల్ రిస్క్ చేస్తున్నాడేమోనని గుసగుసలాడుకొంటున్నారు. మాలీవుడ్,టాలీవుడ్, కోలీవుడ్.. లో సూపర్ స్టార్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా భారీ బడ్జెట్ చిత్రం తీసిన వర్కవుట్ అవుతుందని మరికొందరు అంటున్నారు. ఈ చిత్రం పూర్తి విశేషాలు త్వరలోనే తెలియనున్నాయి.

లేటెస్ట్ గాసిప్స్