ఎన్టీఆర్’గా మోక్షజ్ఝ ?

Nandamuri-Mokshagna

మహానటుడు ఎన్టీఆర్ బయోపిక్’ని తెరకెక్కిస్తున్నట్టు నందమూరి బాలకృష్ణ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి మహానటుడు బయోపిక్ ని డీల్ చేయబోయే దర్శకుడు ఎవరు ? అంతకన్నా.. మహానటుడు ఎన్టీఆర్’గా కనిపించబోయే హీరో ఎవరన్నది తెలుసుకొనేందుకు తెలుగు ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ దర్శకుడు తేజ అన్నది దాదాపు ఖరారైనట్టేనని చెబుతున్నారు. ప్రస్తుతం దర్శకుడు తేజ ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఇక, తాత ఎన్టీఆర్’గా బాలకృష్ణ తనయుడు మోక్షజ్జ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారమ్. ఎన్ టీఆర్ బయోపిక్ లో ఎన్ టీఆర్ టీనేజ్ పాత్రలో మోక్షజ్ఝ కనిపించబోతున్నాడు. ఇది సెంటిమెంట్ గా బాగుంటుందని బాలయ్య కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. టీనేజ్ ఎన్ టీఆర్ మోక్షజ్ఝ ఓకే. ఆ వయసు దాటాక ఎన్ టీఆర్ గా ఎవరు కనిపించబోతున్నాడు అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి.. మోక్షజ్ఝ ఎంట్రీని బాలయ్య భలే ప్లాన్ చేశాడని నందమూరి అభిమానులు చెప్పుకొంటున్నారు.

ఈ సినిమా వచ్చే యేడాది జనవరిలో సెట్స్ మీదకి వెళ్లనుంది.