మోక్షజ్ఞ ఇంకా రెడీ కాలేదు

నందమూరి బాలకృష్ణ తన కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని చానాళ్ల నుంచి చెబుతున్నాడు. కానీ ఇప్పటివరకు అది జరగలేదు. 2018లో మోక్షజ్ఞ ఎంట్రీ పక్కా అన్నారు. విదేశాల్లో యాక్టింగ్ శిక్షణ తీసుకుంటున్నాడని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
ఐతే, మోక్షజ్ఝ ఇంకా హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ కానట్టు తెలుస్తోంది. తాజాగా, మోక్షజ్ఝ లెటెస్ట్ ఫోటోలు లీక్ అయ్యాయి.

అందులో మోక్షజ్ఞ గెటప్ చూసిన నందమూరి అభిమానులు పెదవి విరుస్తున్నారు. మోక్షజ్ఞ మాములుగా వ్యక్తిగా ఉన్నాడే తప్ప.. హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు ఏమాత్రం అనిపించడం లేదు. తనలో ఎలాంటి మేకోవర్ కనిపించడం లేదు. ఈ పిక్ ఇటీవల ఎన్ టీఆర్ బయోపిక్ సమయంలో తీసినదిగా అనిపిస్తోంది.