దేవదాస్ ను కూడా వదలని నాగ్..?

కింగ్ నాగార్జున సినీ ఇండస్ట్రీ లో అడుగుపెట్టి చాల కాలమే అవుతుంది..ఓ పక్క హీరోగా మరో పక్క వ్యాపార వేత్తగా రెండు రంగాల్లో రాణిస్తున్నాడు. కానీ కొడుకుల సినీ కెరియర్ విషయంలోనే కాస్త వెనుకపడ్డాడు. అందుకే తమ వారసుల చిత్రాల విషయంలో చాల జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. సినిమా కథల దగ్గరి నుండి సన్నివేశాలను రీ షూట్ వరకు అన్ని చూసుకుంటున్నాడు.. అయితే తమ కొడుకుల సినిమా విషయంలోనే కాదు తన సినిమా విషయం లో కూడా నాగ్ ఇలాగే వ్యవహారిస్తున్నాడట.

గత రెండు మూడేళ్లుగా ఏ సినిమాను కూడా వదలకుండా ఎడిటింగ్ రూమ్ లో కూర్చొని కత్తెర కు పనిచెపుతున్నాడట. తాజాగా నాని – నాగార్జున ల కలయికలో వస్తున్న దేవదాస్ చిత్ర విషయంలోనూ అలాగే చేస్తున్నాడనే వార్త ఇప్పుడు సినీ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. ఈ చిత్రానికి శ్రీ రామ్ ఆదిత్య డైరెక్టర్ చేస్తున్న సంగతి తెలిసిందే. గతం లో శ్రీ రామ్ డైరెక్ట్ చేసిన చిత్రాలు గొప్ప సక్సెస్ అయినవి కావు.. టాక్ పరంగా, కమర్షియల్ గా రెండు, యావరేజ్ సినిమాలు అందించాడు. అందుకే దేవదాస్ విషయంలో నాగ్ చాల కేర్ తీసుకుంటున్నాడట. సినిమా మొదటి నుండి కూడా అన్ని దగ్గరినుండి చేసుకుంటున్నాడని , ఇప్పటికే రఫ్ వెర్షన్ ఓసారి చూసాడని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వర్షన్ చూసి నాగ్ ఏమన్నాడో అనేది తెలియాల్సి ఉంది.

వైజయంతి మూవీస్ బ్యానర్ ఫై అశ్విని దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా , మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నాడు. సెప్టెంబర్ 27 న ఈ మూవీ విడుదల కానుంది.