అనుష్క ఇష్టమని ఇలా చెప్పాడు

NAG-ANUSHKA
నాగార్జున – అనుష్కలది హిట్ పెయిర్. తెర వెనక కూడా వీరి మధ్య ఏదో ఉందని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. నాగ్ చేసిన ప్రతి సినిమాలోనూ అనుష్క కనబడుతుంటం కూడా ఈ ప్రచారానికి కారణం కావొచ్చు. ‘బాహుబలి 2’తో బిజీ కారణంగా 2017లో ఒక్క సినిమా కూడా చేయని అనుష్క.. నాగ్ చేసిన సోగ్గాడే చిన్ని నాయన, ఊపిరి చిత్రాల్లో గెస్ట్ రోల్ లో మెరిసింది. స్వీటీ వల్ల ఆ రెండు చిత్రాల క్రేజ్ కూడా కాసింత పెరిగాయనే చెప్పవచ్చు. దీన్ని బట్టి.. నాగ్ – అనుష్కల మధ్య బంధం ఎంత గట్టిదో చెప్పవచ్చు.

ఆ ఇష్టాన్ని మరోసారి చూపించారు నాగార్జున. ఆదివారం హైదరాబాద్ హైటెక్స్ లో నాగార్జున తాజా చిత్రం ‘ఓ నమో వెంకటేశాయ’ ఆడియో వేడుక జరిగింది. స్టేజ్ పైకి వచ్చి మైకు పట్టుకోగానే.. ఈ చిత్రంలో అందరు తనకి ఇష్టమైన వాళ్లు నటించారని ఓ చిరు స్ల్మైల్ ఇచ్చారు నాగ్. ఆడియో వేడుకకి నాగ్ భార్య అమల కూడా విచ్చేసింది. ఈ కారణంగా అనుష్క ఇష్టమని నాగ్.. ఇలా పరోక్షంగా కామెంట్ చేశాడని గుసగుసలు వినబడుతున్నాయి.

అంతెలే.. ఇష్టం ఉంటే ఎవరున్నా ఆగుతుందా.. ? పైకి తన్నుకురాదు. ఇప్పుడు నాగ్ కి కూడా అదే జరిగింది. ఇక, ఓం నమో వెంకటేశాయ ఆడియో వేడుక చాలా కూల్ గా సంప్రదాయ రీతిలో జరిగింది. ఈ చిత్రం ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.