పోలీస్ ఆఫీసర్ పాత్రలో నాని..?

కృష్ణార్జున యుద్ధం తో నిరాశ పరిచిన నాని ప్రస్తుతం నాగార్జున తో చేస్తున్న దేవదాస్ చిత్రం ఫై భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఈ సినిమా ఎలాగైనా ప్రేక్షకులను అలరిస్తుందని గట్టి నమ్మకం తో ఉన్నారు. శ్రీ రామ్ ఆదిత్య డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ అంత పూర్తి చేసుకొని , పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. సెప్టెంబర్ 27 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదిలా ఉంటె ప్రస్తుతం నాని మళ్లీ రావా ఫేమ్ గౌతమ్ దర్శకత్వంలో జర్సీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుంది. ఇది కాక విభిన్న కథలతో ప్రేక్షకులను అలరించే చంద్రశేఖర్ యేలేటి తో ఓ సినిమా చేయబోతున్నట్టు ఓ వార్త ఎప్పటి నుండి చక్కర్లు కొడుతుంది. తాజాగా ఆ వార్తకు మరింత బలం చేకూరేలా ఈ సినిమాలో నాని పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్టు టాక్. మరి ఈ వార్త ఎంత వరకు నిజం అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.