బిగ్ బాస్ హోస్ట్ గా నయన్ ?


స్టార్ హీరోయిన్ నయనతార బుల్లితెరపై సందడి చేయబోతుంది. దీనికి సంబంధించిన ప్రోమో కూడా బయటికొచ్చింది. ఐతే, అది ఏ ప్రోగ్రామ్ కి సంబంధించిన ప్రోమో అన్నది నిర్వాహకులు చెప్పలేదు. తాజా సమాచారమ్ ప్రకారం నయన్ బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరించబోతున్నట్టు తెలుస్తోంది.

తమిళ్ బిగ్ బాస్ మొదటి రెండు సీజన్లకు యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరించారు. ఐతె, ప్రస్తుతం కమల్ రాజకీయాల్లో ఉన్నారు. వచ్చే తమిళనాడు ఎన్నికల్లో కమల్ పార్టీ పోటీ చేయనుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హోస్ట్ గా కమల్ కంటిన్యూ కాలేకపోతున్నాడు. ఆయన స్థానంలో నయన్ ని తీసుకొన్నట్టు తెలుస్తోంది.