వైరల్ : ఈ యేడాది నయన్ పెళ్లి

స్టార్ హీరోయిన్ నయన తార ఈ యేడాది పెళ్లి చేసుకోబోతుంది. ప్రియుడు విఘ్నేష్ శివన్ తో ఏడడుగులు వేయనుందని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. గత కొన్నాళ్ళుగా దర్శకుడు విష్నేష్ శివన్’తో నయన్ పీకల్లోతు ప్రేమలో ఉంది. ఏ మాత్రం సమయం దొరికిన ఈ జంట ఫారిన్ చెక్కేసి.. అక్కడ సేద తీరి వస్తుంది.

ఈ జంటకు ఇప్పటికే పెళ్లైపోయిందనే ప్రచారం కూడా జరిగింది. సీక్వెట్ గా ఈ జంట చర్చీలో పెళ్లి చేసుకొందని చెప్పుకొంటారు. ఐతే, ఇప్పుడు వీరి పెళ్లి న్యూస్ కోలీవుడ్ హాట్ టాపిక్ గా మారింది. గతంలో శింబు, ప్రభుదేవాలతో నడిపిన ప్రేమాయణం పెళ్లి వరకు వెళ్లలేదు. ఆ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సారి అధికారికంగా ప్రియుడు విఘ్నేష్ శివన్ తో మూడు ముళ్లు వేయించుకోవాలని నయన్ ఆశపడుతోంది. మరీ.. ఆ కోరిక ఈ యేడాదియే తీరుతుందేమో చూడాలి.