యుఎస్’లో నయన్ ప్రియుడితో.. ఇలా !

కోలీవుడ్ ప్రేమ జంట అమెరికాలో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది. స్టార్ హీరోయిన్ నయనతార, తమిళ్ దర్శకుడు విష్నేష్ శివన్ తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ జంట సమ్మర్ వెకేషన్స్ ని అమెరికాలోని లాస్ ఏంజెలెస్ లో ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలని ఎప్పటిలాగే అభిమానులతో పంచుకొంది నయన్. ‘స్పెషల్ మూమెంట్స్ అండ్ మెమొరీస్… వీక్కీనయన్’ అంటూ ట్వీట్ చేసింది. ఇప్పుడీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ మారాయి.

గతంలో నయన్ నటుడు శింభు, కొరియోగ్రాఫర్, నటుడు ప్రభుదేవాతో ప్రేమాయణాలు సాగించింది. ఈ రెండు కూడా పెళ్లి పీటలు ఎక్కకుండానే పెటాకులు అయ్యాయి. ఈ నేపథ్యంలో నయన్ విఘ్నేష్ శివన్ తో ప్రేమ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకొంటున్నట్టు చెప్పుకొంటున్నారు. కొందరైతే.. ఈ ప్రేమజంట ఇప్పటికే సీక్రెట్ గా పెళ్లి చేసుకొందనే ప్రచారం జరుగుతోంది. సీక్రెట్ సంగతి ప్రక్కన పెడితే.. పబ్లిక్ గా ఈ జంట ఎప్పుడు ఒక్కటవుతుందనేది ఆసక్తిగా మారింది.