ప్రియుడుని కొంగున కట్టేసుకొన్న ప్రియురాళ్లని చూశాం. ఇప్పుడు ప్రియుడిని చెవికి పెట్టుకొన్న ప్రియురాలు కూడా కనిపించింది. ఆమె ముద్దుగుమ్మ నయనతార. కొన్నాళ్లుగా దర్శకుడు విఘ్నేష్ శివన్ తో నయన్ పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్న... ప్రియుడిని చెవికి కట్టేసుకొంది

vi
ప్రియుడుని కొంగున కట్టేసుకొన్న ప్రియురాళ్లని చూశాం. ఇప్పుడు ప్రియుడిని చెవికి పెట్టుకొన్న ప్రియురాలు కూడా కనిపించింది. ఆమె ముద్దుగుమ్మ నయనతార. కొన్నాళ్లుగా దర్శకుడు విఘ్నేష్ శివన్ తో నయన్ పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్న విషయం తెలిసిందే. ప్రియుడు విఘ్నేష్ ని చెవికి పెట్టేసుకొంది నయన్.

నయన చెవులకి పెట్టుకున్న కమ్మలు v ఆకారంలో వున్నాయి. ఆ v విఘ్నేష్ శివన్ అని తేల్చారు. నయన్ చెవి కమ్ములు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నయన్ ప్రియుడిని చెవికి పెట్టేసుకొంది అనే కామెంట్స్ పెడుతున్నారు నెటిజర్లు. నయన్ తనలో ప్రేమని అస్సలు దాచుకోలేదు. గతంలో శంభు, ప్రభుదేవాలతో ప్రేమలో ఉన్నప్పుడు కూడా వాళ్ల కోసం ప్రత్యేకంగా కనిపించిన సందర్బాలున్నాయి. ఇప్పుడు విష్నేష్ ని వెరీ వెరీ స్పెషల్ గా చెవికి కట్టేసుకొంది నయన్.

ప్రస్తుతం విష్నేష్ శివ సూర్యతో ఓ సినిమా చేస్తున్నాడు. మరోవైపు, నయన్ వరుసగా లేడీ ఓరియెంట్ సినిమాలు చేస్తూ వెలుతోంది. మరి.. చివరికి విష్నేష్ శివన్ – నయన్ ప్రేమ పెళ్లివరకు వెలుతుందేమో చూడాలి.

లేటెస్ట్ గాసిప్స్