నితిన్, రామ్ ఎవరు ముందు ?

టాలీవుడ్ యంగ్ హీరోలు నితిన్, రామ్ లలో ఎవరు ముందు ? అనే ప్రశ్న తలెత్తింది. ఇంతకీ ఏ విషయంలో ఈ పోలికా అంటారా ? అక్కడికే వస్తున్నా.. ! గత యేడాది సీనియర్ హీరో రాజశేఖర్’తో “గరుడ వేగ” సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాడు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. ఇప్పుడీ దర్శకుడు తన తదుపరి సినిమాని నితిన్ తో తీయబోతున్నట్టు వార్తలొచ్చాయ్.

ఇదిలావుండగానే యంగ్ హీరో రామ్ కి కథని చెప్పి ఒప్పించాడు సత్తారు. ఐతే, నితిన్, రామ్ సినిమాలలో ఎవరి సినిమాని ముందు సెట్స్ మీదకు తీసుకెళ్తాడన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ప్రస్తుతం నితిన్, రామ్ ఇద్దరు దిల్ రాజు బ్యానర్ లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. నితిన్ – రాశీఖన్నాల ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా ఇటీవలే సెట్స్ మీదకు వెళ్లింది. ఇక, రామ్ ‘నేను లోకల్’ ఫేమ్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్ .. మేఘా ఆకాశ్ కథానాయికలు. మరీ.. నితిన్, రామ్ లలో సత్తారు ఎవరుని ముందుకు తీసుకెళ్తాడన్నది వేచి చూడాలి.