నితిన్ కు టెన్షన్ పెరుగుతుంది..

కెరియర్ మొదట్లో వరుస హిట్లు అందుకున్న నితిన్…ఆ తర్వాత దాదాపు ఎనిమిది ఏళ్లు హిట్ అంటే ఎలా ఉంటుందో కూడా తెలియని పరిస్థితికి వెళ్ళడు. ఆ తర్వాత విక్రమ్ పుణ్యమా ని ఇష్క్‌ రావడం మళ్లీ నితిన్ కు ఊపిరి పోసినట్లు అయ్యింది. ఆ తర్వాత గుండెజారి గల్లంతయ్యిందే మరో హిట్ పడడం తో నితిన్ మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడు. ఈ రెండు చిత్రాల తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్లో చేసిన ‘అ ఆ’ బ్లాక్‌బస్టర్‌ కావడం తో నితిన్ ఇక వెనుకకు చూసుకోవాల్సిన అవసరం లేదు అని అంత అనుకున్నారు.

కానీ నితిన్ కు మళ్లీ దురదృష్టం వెంటాడింది.. ‘లై’, ‘ఛల్‌ మోహన్‌ రంగ’, ‘శ్రీనివాస కళ్యాణం’ వరుస డిజాస్టర్లు పడే సరికి నితిన్ కు మళ్లీ టెన్షన్ ఎక్కువయ్యింది. గతంలో జరిగినట్లే మళ్లీ జరుగుతుందా..ఇప్పుడు ఏం చేయాలి అనే ఆలోచనలో నితిన్ పడినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఛలో దర్శకుడు వెంకీ కుడుముల చేసే ‘భీష్మ’ పైనే నమ్మకాలన్నీ పెట్టుకున్నాడు. కానీ ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి రాకపోయేసరికి అభిమానుల్లోనూ ఈ సినిమా ఫై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇప్పటికే సోషల్ మీడియా లో ఈ చిత్రం ఫై రకరకాల వార్తలు ప్రచారం అవుతుండడం తో నితిన్ లో కొత్త అనుమానాలు మొదలు అవుతున్నాయట…మొత్తం మీద నితిన్ లో టెన్షన్ ఎక్కువ అవుతుందని సన్నిహితులు చెపుతున్నారు.