రాజ్ తరుణ్ ప్రేమలో నిత్యామీనన్ !


హీరోయిన్ నిత్యామీనన్ గురించి తెలిసిందే. ఆమె స్టార్ హీరో, కుర్ర హీరోనా? అని చూడదు. కథ నచ్చితే చాలు ఎవరి పక్కనైనా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే ఆమె కుర్ర హీరో రాజ్ తరుణ్ సినిమాకు ఓకే చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. ‘గుండె జారి గల్లంతయిందే’ సినిమా దర్శకుడు విజయ్ కుమార్ కొండా రాజ్ తరుణ్ హీరోగా ఓ సినిమా ప్లాన్ చేశాడు.

ఈ సినిమా కోసం హీరోయిన్ గా నిత్యామీనన్ ని సంప్రదించాడు. కథ నచ్చడంతో ఆమె ఓకే చెప్పేసింది. ఇందులో నిత్యా రాజ్ తరుణ్ లవ్వర్ గా కనిపించనుందట. దీంతో నిత్యా కుర్ర హీరో ప్రేమలో పడిందనే ప్రచారం జరుగుతోంది. నిత్యా ఒప్పుకుంది కాబట్టి.. ఆ ప్రేమకథ చాలా బాగుండి ఉంటుందని ఆమె అభిమానులు చెప్పుకొంటున్నారు.