హీరోయిన్ తో దొరికిపోయిన క్రికెటర్

టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్య డేటింగ్ వున్నాడని వార్తలు వచ్చాయి. స్వీడన్‌ భామ ఎల్లీ అవ్‌రామ్‌తో డేటింగ్‌ చేస్తున్నట్లు బాలీవుడ్‌ లో ప్రచారం జరుగుతుంది. ఇటీవల పాండ్య సోదరుడు క్రునాల్ పాండ్య వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఈ పెళ్లి వేడుకకు ఎల్లి హాజరైంది. అంతే కాకుండా పాండ్యతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి.

కాగా దీనిపై ఎలీని అడిగితె ‘ఈ విషయంలో నేను ఏం చెప్పినా ఎవ్వరూ నమ్మరు. అయినా ఎవరేమనుకుంటే నాకేంటి?’అని చెప్పుకొచ్చింది

తాజాగా.. హార్దిక్‌ను ఎయిర్‌పోర్ట్‌ వద్ద దించేందుకు ఎల్లీ వచ్చింది ఎల్లీ, హార్దిక్‌ కారులో పక్కపక్కనే కూర్చుని ఎయిర్‌పోర్ట్ వద్దకు రావడం మీడియా కంటపడింది. దాంతో ఎల్లీ ఎవ్వరికీ కన్పించకుండా ముఖాన్ని జుట్టుతో కప్పేసుకుంది. దీంతో వీరి వ్యవహారం మళ్ళీ బయటపడింది.