యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ఎప్పుడైనా మీసం లేకుండా చూశారా.. ? చూసి ఉండరు. ఎందుకంటే.. ? ఇప్పటివరకు ఎప్పుడూ ఎన్టీఆర్ మీసం తీయలేదు. అలా తీయడం ఆయనకి ఇష్టం ఉండదు కూడా.... మీసం లేని ఎన్టీఆర్.. చూస్తారా.. ?

ntr-DSP

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ఎప్పుడైనా మీసం లేకుండా చూశారా.. ? చూసి ఉండరు. ఎందుకంటే.. ? ఇప్పటివరకు ఎప్పుడూ ఎన్టీఆర్ మీసం తీయలేదు. అలా తీయడం ఆయనకి ఇష్టం ఉండదు కూడా. అయితే, ‘బృందావనం’కోసం మీసాలని ట్రిమ్ చేసి.. కాస్త హ్యాండ్సమ్ లుక్ లో కనిపించారు. అయితే, ఇప్పుడు మీసం లేని ఎన్టీఆర్ ని చూడబోతున్నట్టు సమాచారమ్.

ఎన్టీఆర్ – బాబీ దర్శకత్వంలో ‘జై లవ కుశ’ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఘనంగా జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో గెడ్డం, పొడవాటి జుట్టుకు క్లిప్ పెట్టుకొని కనిపించాడు. ఈ లుక్ ‘జై లవ కుశ’ లోనిదే. అయితే, ఇందులో తారక్ త్రీపాత్రాభినయం చేయనున్న విషయం తెలిసిందే. ఇందులో పాత్రలో ఎన్ టీఆర్ మీసం లేకుండా కనిపించబోతున్నాడట. ఈ లుక్ ని సీక్రెట్ గా ఉంచాలని చిత్రబృందం భావిస్తోంది.

హాలీవుడ్, బాలీవుడ్ నుంచి టాప్ టెక్నిషన్స్ ఈ చిత్రం కోసం పని చేయనున్నారు. హాలీవుడ్‌ టెక్నిషయన్ వాన్స్‌ హార్ట్వెల్‌, బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్‌గా సీకే మురళీధరన్‌ను ఈ చిత్రం కోసం తీసుకొన్నారు. తారక్ ఈ చిత్రాన్ని ఓ ప్రయోగంలా భావిస్తున్నారు.

అయితే, ఎన్టీఆర్ మీస లేకుండా కనిపించబోతున్నారన్న న్యూస్ నందమూరి అభిమానులని థ్రిల్ కి గురిచేస్తోంది. మీసం లేని ఎన్టీఆర్ ఎలా ఉంటాడో చూద్దాం మరీ.. !

Indywood Film Carnival
లేటెస్ట్ గాసిప్స్