‘ఊపిరి’ వివాదం ముగిసిందా. ? పరిస్థితులు చూస్తుంటే ముగిసినట్టే కనబడుతోంది. ‘ఘాజీ’ ప్రిమియర్ షోకి వంశీ పైడిపల్లి హాజరయ్యాడు. పీవీపీ, వంశీలు కలసి కెమెరాకి పోజులిచ్చారు. వీరిద్దరి మధ్య ఒకప్పటి అనుబంధం కనబడింది.... వివాదం ‘ఊపిరి’వదిలింది !

ghazi

‘ఊపిరి’ వివాదం ముగిసిందా. ? పరిస్థితులు చూస్తుంటే ముగిసినట్టే కనబడుతోంది. ‘ఘాజీ’ ప్రిమియర్ షోకి వంశీ పైడిపల్లి హాజరయ్యాడు. పీవీపీ, వంశీలు కలసి కెమెరాకి పోజులిచ్చారు. వీరిద్దరి మధ్య ఒకప్పటి అనుబంధం కనబడింది. దీంతో.. ఊపిరి వివాదం ముగిసినట్టేననే అంచనా వేస్తున్నారు. అయితే, ఈ వివాదం ఇంతకీ దగ్గింది ఎవరు.. ?

అత్యంత విశ్వసనీయ సమాచారమ్ ప్రకారం పీవీపీనే తగ్గాడాట. ఈ వివాదంలో మహేష్ సపోర్టు వంశీ సైడ్ నే ఉంది. పైగా, వంశీకి తెలంగాణ మంత్రి కేటీఆర్ మంచి స్నేహితుడట. ఈ నేపథ్యంలో బలంలేని వాదనలతో రచ్చ చేసుకోవడం ఎందుకని పీవీపీని దొగిచ్చినట్టు తెలుస్తోంది. భవిష్యత్ లో మహేష్ తో మళ్లీ లావాదేవీలు చేయాలనిఆశపడుతోంది పీవీపీ.

ఈ నేపథ్యంలోనే ఘాజీ ప్రీమియర్ కి వంశీని స్పెషల్ గా ఆహ్వానించి ఊపిరి వివాదం ముగిసినట్టు కెమెరాకి స్మయిలీ పోజులిచ్చినట్టు చెప్పుకొంటున్నారు. మొత్తానికి వివాదం ఊపిరొదిలింది.

లేటెస్ట్ గాసిప్స్